Telangana లో 60 కొత్త మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల ఏర్పాటుకై ఉత్తర్వులు జారీ




60 కొత్త మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల ఏర్పాటుకై ఉత్తర్వులు జారీ 


​రాష్ట్రంలో కొత్తగా 60 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత ఉత్తర్వులపై బుధవారం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు సంతకం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, బైంసా, కాగజ్‌నగర్‌, మంచిర్యాల, ఖానాపూర్‌, నిజామాబాద్‌ జిల్లాలో నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్‌, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, సిరిసిల్ల, హుజురాబాద్‌, ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి, మెదక్‌ జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట, సదాశివపేట, పటాన్‌చెరు, మెదక్‌, నారాయణఖేడ్‌, గజ్వేల్‌, ఆంధోల్‌, నర్సాపూర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మహబూబ్‌నగర్‌, గద్వాల, జడ్చర్ల, ఫరూఖ్‌నగర్‌, నారాయణపేట, కల్వకుర్తి, అచ్చంపేట, హైదరాబాద్‌ జిల్లాలో బహదూర్‌పురా, అసిఫ్‌నగర్‌, చార్మినార్‌, సైదాబాద్‌, గోల్కొండ, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్‌, బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, ఉప్పల్‌, తాండూర్‌, వికారాబాద్‌, పరిగి, నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ, వరంగల్‌ జిల్లాలో వరంగల్‌, మహబూబాబాద్‌, జనగామ, హన్మకొండల్లో మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్ళు ఏర్పాటవుతాయి

No comments

Powered by Blogger.